���గవత్ గీత – జ్ఞాన విజ్ఞాన యోగః

���వరైనా శ్రీ కృష్ణుని గురించి ఎటువంటి సందేహం లేకుండా పూర్తిగా ఎలా తెలుసుకోవచ్చు?
A) అనేక గ్రంథాలను చదివి మననం చేయడం వలన
B) ధ్యానం మరియు తపస్సు చేయడం వలన
C) అనేక యజ్ఞాలు మరియు దానాలు చేయడం వలన
D) శ్రీకృష్ణుని మనస్సు నందు పూర్తిగా ధ్యానిస్తూ యోగము చేయడం వలన మరియు అతనికి అంకితం అవడం వలన
���్రీకృష్ణుని ప్రకారం ఏమి తెలుసుకోవడం ద్వారా మరి ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ?
A) ఆత్మను చేరు విధానము తెలుసుకునే జ్ఞానం కలగడం వలన
B) ఆత్మ(తత్త్వము) యొక్క జ్ఞానం(సాంఖ్య జ్ఞానం) కలగడం వలన
C) భగవంతుని యొక్క స్వరూప జ్ఞానం, ప్రకృతి మరియు పురుష(జీవాత్మ), భగవంతునికే చెంది ఉండి ఆ భగవంతుని మీద ఆధారపడి ఉండటం, కానీ అతని కంటే భిన్న స్వరూప మరియు స్వభావాలు కలిగి ఉండటం తెలుసుకోవడం వలన
D) ప్రకృతి, జీవ మరియు పరమాత్మ అందరూ ఒకటే అని అర్ధం చేసుకోవడం వలన
���ీవాత్మలను ఏ విధంగా తెలుసుకొనవచ్చును ?
A) శ్రీ కృష్ణుడికి చెందినవి మరియు వేరు అయినవి
B) పర ప్రకృతిని ధరించే అపర ప్రకృతి
C) అపర ప్రకృతిని ధరించే పర ప్రకృతి
D) a మరియు b రెండు
E) a మరియు c రెండు
���్రహ్మ దేవుని నుంచి పరమాణువులు వరకు విశ్వంలో ఉండే సర్వ భూతాలు
A) శ్రీకృష్ణుని నుండి స్వతంత్రంగా ఉంటారు
B) శ్రీకృష్ణుడే
C) శ్రీకృష్ణుడే వారి ఆవిర్భావం మరియు విధ్వంసం
D) అవన్నీ భ్రాంతి మాత్రమే వాస్తవానికి ఉనికిలో లేనివి
���కటి లేదా ఎక్కువ సరైన ఎంపికలను ఎంచుకోండి?
A) శ్రీకృష్ణుడు వేదములలో చెప్పిన అనేక దేవతలలో ఒకరు
B) శ్రీకృష్ణుడు దేవతలలో ప్రధానమైన వారు
C) శ్రీకృష్ణుడు దేవతలందరి కంటె మిక్కిలి ఉన్నతమైన, హెచ్చైన స్థానములో ఉన్నవారు. వారిలో ఒకరు కాదు.
D) ప్రకృతి ,జీవాత్మ మరియు శ్రీకృష్ణ -ఈ ప్రతీ ఒక్కరు ఇతర వాటితో భిన్నంగా లేవు
E) శ్రీకృష్ణుడు అంతటికీ (ప్రకృతి ,జీవాత్మ,దేవ మరియు సర్వ భూతములు) అంతర్యామి.
F) దేవతలు, మనుష్యులు, తిర్యక మరియు స్థావరములు వీరు ఎవరూ శ్రీకృష్ణుని కంటే సమానం కానీ ఎక్కువ కానీ కాజాలరు.
���కటి లేదా ఎక్కువ సరైన ఎంపికలను ఎంచుకోండి?
A) సూర్యుడు మరియు చంద్రుడు వారి అంతట వారె ప్రకాశం ఉత్పత్తి, వ్యక్తము చేయగలరు.
B) ఓంకారం అన్ని వేదములకు సారాంశం
C) మానవులు తమ స్వంత సామర్ధ్యంతో తపస్సు చేస్తారు అందుచేత వారి తపస్సు వలనే వారు ఫలితం పొందుతారు
D) సూర్యుడు మరియు చంద్రుడు యొక్క కాంతికి కారణం శ్రీకృష్ణుడు
E) శ్రీకృష్ణుడే తపస్సు చేయడానికి గల సామర్ధ్యం ఇస్తారు మరియు తపస్సు కొరకు ఫలితాన్ని ఇచ్చేవారు
���్రకృతి ఎన్ని రకాల లక్షణాలను(గుణాలను) కలిగి ఉన్నది?
A) 0
B) నాలుగు
C) అనేకము
D) మూడు
���గవత్ రామానుజాచార్యులు వారు చెప్పిన ప్రకారం "దైవీ హ్యేషా గుణమయీ మామ మాయా దురత్యయా " అనే శ్లోకంలో "మాయా" అంటే అర్ధం ఏమిటి?
A) ప్రకృతి - ఇది తాత్కాలికంగా ఉన్నది కానీ వాస్తవానికి లేనిది
B) భ్రాంతి - ఇది తాత్కాలికంగా ఉండే ప్రభావం కానీ వాస్తవానికి లేనిది
C) ప్రకృతి- ఇది వాస్తవానికి ఉన్నది
D) భగవంతుడు మనకు కలిగించే కష్టాలు
���ాయని ఎలా అధిగమించవచ్చు?
A) వారు భ్రమలో ఉన్నారని అర్థం చేసుకోవడం ద్వారా
B) వారు శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం ద్వారా
C) భక్తితో ఇష్టదేవతను అయినా పూజించడం ద్వారా
D) ఎటువంటి ఇతర ఎంపిక లేకుండా శ్రీకృష్ణునికి మాత్రమే శరణాగతి చేయడం ద్వారా
E) వారు తమను తాము దేవుడని మరియు ప్రతీ ఒక్కటి మిథ్య అని అర్ధం చేసుకోవడం ద్వారా
F) సర్వము వదులుకుని , అడవికి వెళ్లి, తగిన ఆసనంలో కూర్చొని, ఆసనం బాగా ఎక్కువ ఎత్తులో కాకుండా మరియు తక్కువ కాకుండా, జింక చర్మంపై కూర్చొని, నాసికాగ్రమునందు దృష్టి పెట్టడం మరియు శూన్యము పై కానీ ప్రకాశవంతమైన కాంతి పై కానీ ధ్యానం చేయడం ద్వారా
���ంపద కోసం శ్రీకృష్ణుని ఆరాధించే వారిని ఏమని పిలుస్తారు?
A) దుష్కృత
B) మూఢ
C) జిజ్ఞాసువు
D) ఆర్థార్థి
���వరికైతే శ్రీకృష్ణుని గురించి అతని వ్యక్తీకరణము గురించి సానుకూల జ్ఞానం కలిగి ఉండిననూ శ్రీకృష్ణుని ద్వేషించెదరో వారిని ఏమంటారు?
A) ఆర్తా:
B) మూఢా:
C) నరాధమః
D) అసుర భావమాశ్రితః
���క భక్తి అనగా ఏమిటి?
A) కేవలం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే శ్రీకృష్ణుడిని ఆరాధించడం
B) కేవలం సంపద కోసం మాత్రమే శ్రీ కృష్ణుడిని ఆరాధించడం
C) కేవలం స్వీయ పరిపూర్ణత కోసం శ్రీకృష్ణుడిని పూజించడం
D) శ్రీకృష్ణుని మీద ప్రేమతో మాత్రమే అతనిని పూజించడం మరియు శ్రీకృష్ణుని మాత్రమే కోరుకోవడం తప్ప ఇక ఏ ఇతర భౌతికమైన వరములు కోరుకోక పోవడం
���వరు శ్రీకృష్ణుడిని ఆత్మగా భావిస్తారు?
A) ఉదారహః
B) సుకృతః
C) జ్ఞాని
D) పైనవి అన్నీ
���్రీకృష్ణుడు దేవతలందరికంటే ఉన్నతమైన వారు అయినప్పటికీ, ప్రజలు ఎందుకు ఇతర దేవతలను ఆరాధిస్తారు ?
A) ఎందుకంటే వారికి కలిగి ఉన్న కోరికలు వలన
B) ఎందుకంటే వారికి దేవతలందరూ ఎవరికి వారే స్వతంత్రంగా ఉంటూ ఫలితాలను ఇస్తారు అనే ఆలోచన కలిగి ఉండడం వలన
C) ఎందుకంటే వారు ప్రకృతిచే భ్రమింప పడడం వలన
D) ఎందుకంటే వారికి సరి అయిన జ్ఞానం లేకపోవడం వలన
E) ఎందుకంటే వారు శ్రీకృష్ణుని పై అసూయతో ఉండడం వలన
F) అన్నీ సరైనవి
���కటి లేదా ఎక్కువ సరైన సమాధానములను ఎంచుకోండి?
A) దేవతలందరూ స్వతంత్రులు మరియు వారి భక్తులు ఏమి కోరినా తీర్చగలరు.
B) శ్రీకృష్ణుడే అంతర్యామిగా ఉంటూ దేవతల ద్వారా ఫలితాలను ఇచ్చేవారు.
C) శ్రీకృష్ణుడే వారికి వారి ఇష్టదేవతల యందు శ్రద్ధ మరియు భక్తిని అభివృద్ధి చేస్తారు.
D) దేవతలు శరీరం లాంటి వారు మరియు శ్రీకృష్ణుడే ఆత్మ
E) దేవతలు చాల శక్తివంతులు. తమ భక్తులను మాయ నుండి తామే విముక్తి చేయగలరు.
���ేవతలకు చేసిన ప్రార్ధనలు అన్నీ వారి అంతర్యామి అయిన శ్రీకృష్ణుడిని చేరుకుని, వాస్తవానికి ఆ దేవతలచే ఇవ్వబడుతున్న ఫలితాలను ఇస్తున్నవారు శ్రీకృష్ణుడే అయితే (ఒకటి లేదా ఎక్కువ సరైన సమాధానములను ఎంచుకోండి)
A) అందరు దేవతలను ఆరాధించడం వలన ఒకటే ఫలితం వస్తుంది.
B) అందరు దేవతలను ఆరాధించడం అనేది శ్రీకృష్ణుని ఆరాధించడంతో సమానం.
C) ఫలితాలను ఇచ్చేవారు శ్రీకృష్ణుడే అయినప్పటికీ, దేవతల సామర్ధ్యం ప్రకారం శ్రీకృష్ణుడు తాత్కాలిక మరియు పరిమిత ఫలితాలను మాత్రమే ఇస్తారు. అందువలన ఫలితాలు మారుతూ ఉంటాయి.
D) శ్రీకృష్ణుడి యొక్క అనంత సామర్ధ్యం ప్రకారం, ఎవరైతే శ్రీకృష్ణుని నేరుగా ఆరాధిస్తారో వారు అత్యధిక మరియు ఎప్పటికీ తరగని ఫలితాలను పొందుతారు.
E) ఎవరైతే దేవతలను ఆరాధిస్తారో వారు ఆయా దేవతల వద్దకు వెళ్తారు కానీ ఎవరైతే శ్రీకృష్ణుని ఆరాధిస్తారో వారు విముక్తి పొంది శ్రీకృష్ణుడు ఉండే నివాసానికి వెళ్తారు.
���ేవతారాధన గురించి శంకరాచార్యులు వారు ఏమని వ్యాఖ్యానం చేసారు?
A) “ఎవరిని పూజించడం అయినా ఒకటే”
B) “ఏ దేవత అయినా పరమాత్మే మరియు శ్రీకృష్ణుని తో సమానము”
C) “ఏ దేవతని ఆరాధించినా మోక్షం ఇస్తారు”
D) “దేవతలను పూజించడానికి, నన్ను పూజించడానికి కృషి ఒకటే అయినప్పుడు ఈ అజ్ఞానులు ఎందుచేత నన్ను నేరుగా(ఒంటరిగా) పూజించి అనేక ఫలితాలను పొందడం లేదు? అయ్యో! ఇది చాలా బాధాకరమైనది- అని శ్రీకృష్ణుడు విచారించెను”
���్రీకృష్ణుని గురించి అల్ప బుద్ధి కలిగినటువంటి వారు ఏమని ఆలోచిస్తారు?
A) శ్రీకృష్ణుడు ఒక అవతారం అయినప్పటికీ, వారు మానవునిగా జన్మించినందున శక్తివంతంగా ఉండలేరు, వారికి పరిమిత సామర్ధ్యం కలిగి ఉంటారు.
B) శ్రీకృష్ణుడు కేవలం ఒక సాధారణ మానవుడు మరియు వారు ఇతరుల లానే జన్మించారు మరియు వారు తమ జననానికి ముందు ఉన్నవారు కాదు.
C) శ్రీకృష్ణుడు గొప్ప మానవుడు కానీ వారు భగవంతుడు కాదు మరియు వారు తమ కర్మ ద్వారా జన్మించినవారు. కొంతమంది ప్రజలు శ్రీకృష్ణుని భగవంతునిగా భావిస్తూ ఆరాధిస్తున్నారు, ఎందుకంటే శ్రీకృష్ణుడు చేసిన కొన్ని వీరోచిత చర్యలు వలన.
D) అన్నీ సరైనవి
���వరైతే తమని తాము స్వతంత్రులుగా అనుకుంటూ మరియు ప్రపంచంలో ఉన్న అన్ని ఆహ్లాదకరమైన విషయాలు వారి సొంతముగా భావిస్తూ, అవి వారు అనుభవించడానికి మాత్రమే అని భావించెదరో ,వారిని ఏం అంటారు?
A) నరధమః
B) అసుర భావమాశ్రితః
C) మయ అపహ్రత జ్ఞానః
D) మూఢా:
���కటి లేదా ఎక్కువ సరైన సమాధానములను ఎంచుకోండి?
A) శ్రీకృష్ణుని చేరి ఆరాధించే వారిలో కేవలం జ్ఞాని మాత్రమే ఉదారమైన వాడు కానీ బాధలో ఉండే అర్థుడు, సంపదలు కోరే అర్థార్ధి లేక కైవల్య ప్రాప్తి కోరే జిజ్ఞాసువు కాదు.
B) ‘రజో గుణం’ మరియు ‘తమో గుణం’ లో ఉన్న జీవులు కుడా శ్రీకృష్ణుడి నుంచే ఉద్భవించాయి.
C) ఏ విధంగా అయితే ఒక విత్తనము నుండి వృక్షము వచ్చిన తరువాత ఆ విత్తనము ఉండదో , అదే విధముగా ప్రకృతి, జీవుల సమూహమైనటువంటి ఈ జగత్తు ఆవిర్భవించిన తరువాత, దానికి కారణమైన ఆ పరమాత్మ ఉండడు.
D) పుణ్యాత్ములైన వారు శ్రీకృష్ణుని ఆరాధిస్తారు, అందులో ఎవరి పాపములైతే పూర్తిగా నశిస్తాయో, వారు దృఢ వ్రతులై శ్రీకృష్ణుడినే ఆరాధించెదరు.
{"name":"���గవత్ గీత – జ్ఞాన విజ్ఞాన యోగః", "url":"https://www.quiz-maker.com/QPREVIEW","txt":"ఎవరైనా శ్రీ కృష్ణుని గురించి ఎటువంటి సందేహం లేకుండా పూర్తిగా ఎలా తెలుసుకోవచ్చు?, శ్రీకృష్ణుని ప్రకారం ఏమి తెలుసుకోవడం ద్వారా మరి ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ?, జీవాత్మలను ఏ విధంగా తెలుసుకొనవచ్చును ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker